• Home » New Delhi 

New Delhi 

Vote for Note Case: మళ్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి కేసు...

Vote for Note Case: మళ్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి కేసు...

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మళ్లీ హైకోర్టుకు వచ్చి చేరింది. ఓటుకు నోటు వ్యవహారంలో ఐదుగురు సాక్షులను ఒకే సారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి అవకాశం కల్పించాలని రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున ఇకపై ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

Chintamaneni: బండారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు

Chintamaneni: బండారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు

చిన్న స్థాయి నేతల నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హత్యచేసి..రెండేళ్లపాటు బతికే ఉందని నమ్మించాడు!

హత్యచేసి..రెండేళ్లపాటు బతికే ఉందని నమ్మించాడు!

ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగంచేసే 27ఏళ్ల యువ తి దారుణహత్య రెండేళ్ల తర్వాత వెలుగుచూసింది!

Kishan Reddy: హుటాహుటిన ఢిల్లీకి కిషన్‌రెడ్డి.. అందుకోసమేనా?..

Kishan Reddy: హుటాహుటిన ఢిల్లీకి కిషన్‌రెడ్డి.. అందుకోసమేనా?..

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (మంగళవారం) నిజామాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తోన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థుల కసరత్తు కోసమే తెలంగాణ బీజేపీ చీఫ్ ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది.

Lokesh: ఢిల్లీలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభం

Lokesh: ఢిల్లీలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌‌కు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. చంద్రబాబు, భువనేశ్వరీల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు.

BJP CEC meeting: బీజేపీ కీలక సమావేశం.. ఖరారు కానున్న 2 రాష్ట్రాల అభ్యర్థులు

BJP CEC meeting: బీజేపీ కీలక సమావేశం.. ఖరారు కానున్న 2 రాష్ట్రాల అభ్యర్థులు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం రాత్రి గంటలకు సమావేశమైంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్‌అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.

Delhi Massive Fire: అజాద్‌పూర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

Delhi Massive Fire: అజాద్‌పూర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధానిలో అతిపెద్ద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ అజాద్‌పూర్ మండిలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. సమాచారం తెలిసిన వెంటనే 11 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసాయి. ప్రస్తుతం కూలింగ్ ప్రోసెస్ జరుగుతోంది.

Congress Leader: వాళ్లకు మాత్రమే టికెట్ ఇచ్చారు.. బీసీ వర్గాలకు టికెట్లు కేటాయించారా?

Congress Leader: వాళ్లకు మాత్రమే టికెట్ ఇచ్చారు.. బీసీ వర్గాలకు టికెట్లు కేటాయించారా?

సమాజంలో అర్ధభాగం ఉన్న బీసీలకు అసెంబ్లీ సీట్లలో న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి